జూన్ 5న తెలంగాణ కేబినెట్ సమావేశం

 

తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 5 మధ్యాహ్నం 3 గంటలకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో నిర్వహించానున్నారు. రాజీవ్ యువవికాసం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి,  వానాకాలం పంటలపై కేబినేట్‌లో చర్చ జరగనున్నాది. దరఖాస్తుల పూర్తి పరిశీలన తర్వాతే రాజీవ్‌ యువ వికాసం అర్హులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో చర్చించిన తర్వాతే రాజీవ్‌ యువ వికాసంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. 

ఒక్క అనర్హుడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడదని సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎంకు ఇప్పటికే నివేదిక అందింది. నివేదికను సీఎం, మంత్రులకు భట్టి విక్రమార్క వివరించారు. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్‌లో చర్చించాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించినందుకు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి సీఎం, మంత్రులు అభినందనలు తెలిపారు. మే 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ నాలుగు అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu