నేడు రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం!
posted on Feb 20, 2014 9:43AM
.jpg)
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదంపొందే అవకాశం వుంది. బుధవారమే రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేంద్రం భావించిన..తాము సూచించిన సవరణలు చేపట్టాల్సిందేనని బీజేపీ పట్టుబట్టడంతో బిల్లు ప్రవేశం వాయిదా పడింది. అయితే ఈరోజు విభజన బిల్లును ఎలాగైనా సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
పార్లమెంటులో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ముఖ్యమంత్రి కిరణ్ రాజీనామాపై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చిస్తున్నారు. బిజెపి సూచించిన సవరణలపైన మలగుల్లాలు పడుతున్నారు. నేడు పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో బయట భారీ బందోస్తు ఏర్పాట్లు చేసారు.