అసెంబ్లీ ముందే రైతు ఆత్మహత్యాయత్నం
posted on Sep 29, 2015 5:29PM

అన్నదాతల ఆత్మహత్యలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంటే, ఓ రైతు ఏకంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న సెల్ టవర్ పైకెక్కి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు, వ్యవసాయంలో నష్టం రావడంతో తనకు రెండు లక్షల రూపాయలు అప్పు అయ్యిందని, దాన్ని ఎలా తీర్చాలో తెలియడం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రులకు తన గోడును వెళ్లబోసుకోవడానికి వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని, ఇక తనకు చావే శరణ్యమంటూ సెల్ టవర్ పైనే పురుగుల మందు తాగేశాడు, దాంతో అసెంబ్లీ పరిసరాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది, అయితే పురుగుమందు తాగిన రైతు సమ్మయ్యను అతికష్టంమీద కిందికి దించిన పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు, సమ్మయ్య...వరంగల్ జిల్లా నెక్కొండ వాసిగా గుర్తించారు.