మూడోరోజూ మిన్నంటిన బతుకమ్మ సంబరాలు
posted on Oct 15, 2015 7:16PM

తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయ్. ఉయ్యాల పాటలు, కోలాటాల, గౌరమ్మ పూజలతో బంగారు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ సంబరాలు మిన్నంటాయి. తెలగాణ భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న వేడుకలు కూడా ఘనంగా జరిగాయి, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ అచ్చమైన పల్లె పాటల నడుమ మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం బంగారు బతుకమ్మ నృత్యరూపకం ప్రదర్శించారు. బతుకమ్మ సాక్షిగా నూటికి నూరుశాతం ఆడపిల్లలను చదివించాలంటూ నిర్ణయం తీసుకున్నారు, బతుకమ్మపై వివిధ రకాల పూలను ఎలా అమర్చుతారో తెలంగాణ రాష్ట్రంలో కూడా విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న వర్గాలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉండాలని ఆకాంక్షించారు.