రవీంధ్రభారతిలో రెండోరోజూ అదే ఉత్సాహం
posted on Oct 15, 2015 7:02PM

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో... హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు తరలివచ్చారు. విద్యుత్ దీపాల కాంతులతో రవీంద్రభారతి ప్రాంగణం వెలిగిపోతుంటే, తెలంగాణ ఆడపడుచులంతా బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటున్నారు, తెలంగాణ సంస్కృతి పట్ల అవగాహన కల్పించడానికి ఈ వేడుకల్లో విద్యార్థులను కూడా భాగస్వాములుగా చేశారు. ఈ సందర్భంగా రవీంద్రభారతిలో విద్యార్ధులు ప్రదర్శించిన కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం పలువురు కళాకారులను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో నందిని సిధారెడ్డి, ఆచార్య ఏస్‌వీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు