తెలంగాణ కోసం సమ్మక్కకు మొక్కుతాం కాంగ్రెసు ఎంపీలు

వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాము పోరాటం చేస్తూనే ఉంటామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు చెప్పారు.  సమ్మక్క - సారలమ్మ దర్శనం కోసం వారు  వరంగల్ జిల్లా మేడారం జాతరకు వచ్చారు. తెలంగాణ రావాలని సమ్మక్కకు మొక్కుతామని వారన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉన్న అవాంతరాలను ఎదుర్కుంటామని ఆయన చెప్పారు.  తెలంగాణ కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. పోరాట పటిమ తగ్గకుండా చూసుకుంటామని ఆయన చెప్పారు. ఇతర రాజకీయ పార్టీలను కూడా కలుపుకుని తాము తెలంగాణ కోసం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ కోసం తాము ఓసారి పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేశామని, మరోమారు పార్లమెంటు సమావేశాలను బహిష్కరించామని, అధికార పార్టీలో ఉంటూ కూడా తాము తెలంగాణ కోసం పోరాటం చేశామని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇవ్వాలనే భావన అన్ని పార్టీల నాయకుల్లో ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ గురించి సమయం, సందర్బాన్ని బట్టి మాట్లాడుతామని, అంత మాత్రాన తాము పోరాటాన్ని ఆపేశామని కాదని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu