ఏపీ అంతటా అంబటి సెగలు.. వైకాపాకు చితి మంటలేనా?
posted on Nov 20, 2021 3:13PM
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, వైకాపా ఎమ్మెల్ల్యే అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల్లో రాజకీయ వర్గాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. పార్టీలకు వర్గాలకు అతీతంగా అందరూ వైకాప నేతల తీరును ఎండగడుతున్నారు. దీంతో వైకాపా ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ముందు ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కొంత దూకుడుగా అంబటిని సమర్ధించే ప్రయత్నం చేసిన ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం కావడం, అన్ని పార్టీలు వైకాపాను తప్పు పట్టడంతో వైకాపా డిఫెన్సులో పడింది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
అయితే, చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా, మంత్రి పేర్నినానీ, ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ అసహనాన్ని ప్రదర్శించారు. ‘అనని మాటలను అన్నారని, జరగని సంఘటన జరిగిందని’ టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని, ఎదురు దాడి ప్రారంభించారు. అంతే కాదు, వైసీపే ప్రభుత్వాన్నిఅస్థిర పరిచేందుకు, తెలుగు దేశం పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అదే సమయంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అసహనం ప్రదర్శించారు.చివరకు కనీసం థాంక్స్ అయినా చెప్పకుండానే మైక్ ఆఫ్ చేసుకుని వెళ్లి పోయారు.
మరోవంక తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఇతర వైకాపా నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్ళు భగ్గు మంటున్నారు. రాష్ట్ర లేదా స్థానిక పార్టీ నాయకులు ఎవరూ ఎలాంటి పిలుపు ఇవ్వకపోయినా ఎక్కడి కక్కడ తెలుగు దేశం కార్యకర్తలు నిరశన తెలియచేస్తున్నారు.ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అంబడీ తిష్టి బొమ్మలను తగుల బెట్టి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరో వంక టీడీపీ ఎమ్మెల్యే బాల కృష్ణ, సహా నందమూరి కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకుల తీరును దుయ్యబట్టారు. “ఇలాంటి నీచపు, నికృష్టపు మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఖబడ్దార్.. భరతం పడతాం” అని బాల కృష్ణ హెచ్చరించారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా వైసీపీ నాయకుల తీరుపట్ల తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్త పరిచారు.
మరోవంక బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ప్రత్యేకంగా, వైసేపీ నేతలు టం సోదరిపై చేసిన సంస్కార రహిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖడించారు. ఎన్టీఆర్ కుమార్తెలుగా తను , భువనేశ్వరి ఐటిక విలువలతో పెరిగామని న్నారు. రాజకీయ విమర్శలలోకి కుటుంబసభ్యులను తీసుకు రావడం తగదని అన్నారు. టీడీపీ నాయకులతో పాటుగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా, వైసీపీ నాయకుల నోటి దురుసు, దుర్మార్గపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అసెంబ్లీలో ఆడపడుచుపై అసత్య ఆరోపణలు సరికావని అన్నారు.
శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిని అవమానపరచడానికి ఆయన భార్య వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడడం సభామర్యాద కాదని తెలిపారు. అసలు సభలో లేని, సభకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించి వారిపై చవకబారు ఆరోపణలు చేయడం విజ్ఞతకాదని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన శాసనసభ వ్యక్తిగత దూషణలకు, నిందారోపణలకు వేదికవ్వటం విచారకరమన్నారు. మహిళలు, కుటుంబ సభ్యులపై నిందారోపణలకు స్వస్తి పలకాలన్నారు. అసభ్య పదజాలంతో దూషణల పర్వంగా ఏపీ అసెంబ్లీ మారిందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. సభను అవమానిస్తూ ఆనందించే ధోరణి అధికార పార్టీలో ఉందని ఆయన ఆరోపించారు. తప్పు చేశామని గ్రహించే స్థాయిలో అధికారపక్షం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్ గురించి దేశమంతా సిగ్గుగా మాట్లాడుకుంటున్నారని అవేదన వ్యక్తపరిచారు. అసెంబ్లీ సభ్యత, సంస్కారాన్ని మంటగలిపారని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం దురదృష్టకరమని... మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలని హితవుపలికారు. అలాగే ఇంకా అనేక మంది ఇతర పార్టీల నాయకులు కూడా, వైసీపీ నేతల తీరును తప్పు పడుతున్నారు,అందుకే వైసీపీలో కలవరం మొదలిందని అంటున్నారు.