తెదేపా ఎమ్మెల్యేపై ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి శాఖ దాడులు
posted on Dec 17, 2015 8:44AM
.jpg)
మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట తెదేపా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాలు, ఆయనకి వైద్య, ఇంజనీరింగ్ కాలేజీల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు నిన్న ఏకకాలంలో దాడులు చేసారు. విశేషమేమిటంటే కర్నాటకలోని బెంగళూరు, గుల్బర్గాల నుండి ఆదాయపన్ను శాఖ అధికారులు వచ్చి ఈ దాడులలో పాల్గొన్నారు. కర్ణాటకలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్ధుల నుండి 1-2 కోట్లు వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక అక్కడి మెడికల్ కాలేజీలపై ఆదాయపన్ను శాఖ అధికారులు చాలా కాలంగా దృష్టి పెట్టి అప్పుడప్పుడు దాడులు చేస్తూనే ఉన్నారు. బహుశః అక్కడి కాలేజీలతో రాజేందర్ రెడ్డి మెడికల్ కాలేజీకి కూడా ఏమయినా సంబంధాలు, లావాదేవీలు జరుగుతున్నందునే కర్ణాటకకు చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దాడుల్లో సుమారు ముప్పై మందికి పైగా అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.