పార్లమెంట్ లో కాంగ్రెస్ రచ్చ.. మాట్లాడలేకపోతున్నాం.. టీడీపీ ఎంపీలు
posted on Jul 23, 2015 6:50PM

పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీనేతల తీరును టీడీపీ ఎంపీలు తప్పుబట్టారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ను దద్దరిల్లేలా చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రుల ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అవకాశం రావట్లేదు. దీనితో కాంగ్రెస్ నేతల వైఖరిపై టీడీపీ ఎంపీలు మండిపడుతున్నారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ తీరుపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌ను స్తంభింపజేయడం వలన ఏపీ సమస్యలు ప్రస్తావించలేకపోతున్నామని.. సభలో కాంగ్రెస్ వైఖరితో ఏపీకి తీరని నష్టం కలుగుతోందని ఎంపీలు వ్యాఖ్యానించారు. సభ సజావుగా సాగితే, ఏపీకి ప్రత్యేక హోదా, నిధులపై చర్చించవచ్చని వారు అన్నారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన తీరును ప్రతిపక్షాలు నేర్చుకోవాలన్నారు.