బైరెడ్డి సాధించిందేమిటీ?
posted on Jul 30, 2012 12:02PM
ప్రత్యేకరాయలసీమ రాష్ట్రం కావాలనే డిమాండుతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేస్తున్న ఉద్యమం వల్ల సాధించిందేమిటీ? ఈ ప్రశ్న ఒక్క పార్టీ కాదు యావత్తు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వస్తోంది. అయితే వాస్తవానికి తెలంగాణా ఇంక ఇవ్వలేమన్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ రావటానికి ఈయన చేపట్టిన ఆందోళనే కీలకమయిందని ఆ పార్టీ నేతలంటున్నారు. వేర్పాటువాదం వల్ల వచ్చే ప్రమాదాన్ని బైరెడ్డి చేసిన ఉద్యమాల వల్ల అర్థం చేసుకున్న కాంగ్రెస్ ఇక త్వరలో బయటపడేందుకు సిద్ధపడుతోంది. అయితే హోంశాఖ నివేదిక అవాస్తవమైనా కూడా ప్రత్యేక తెలంగాణా ఇచ్చేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మాత్రం సిద్ధంగా లేరన్నది వాస్తవం.
అగ్గికి ఆజ్యం పోసినట్లు ఇటీవల హైదరాబాద్ వచ్చిన బైరెడ్డి తన తోటి రాయలసీమ వాసులందరినీ కూడగట్టుకుని అవసరమైతే తెలుగుదేశం పార్టీకి రాజీనామా అయినా చేస్తాను కానీ, ప్రత్యేక రాయలసీమ సాధించేంత వరకూ విశ్రమించనని ప్రకటించారు. తమ రాయలసీమ పౌరుషాన్ని, తమ ప్రాంతానికి జరిగిన నష్టాన్ని కళ్లకు కట్టినట్లు ఆయన ప్రకటించిన తీరు తెరాసకు ఒళ్లు మండేలా చేసింది. దీంతో అక్కసు ఆపుకోలేక తమ తెలంగాణా రాయలసీమ నుంచి బైరెడ్డి ఒకరని టిఆర్‌ఎస్ ప్రకటించేసింది. ప్రత్యేకించి ఉన్నదీ, లేనిదీ అవాకులు, చవాకులు పేలే హరీశ్‌రావు బైరెడ్డిపై కోపాన్ని విమర్శల రూపంలో కక్కేశారు. అయితే బైరెడ్డి ఉద్యమబాట పట్టకపోతే తెలంగాణా వచ్చేసేదని టిఆర్‌ఎస్ ప్రచారం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏమి సాధించలేదంటారే ఒక కొత్తశత్రువులను ఏర్పాటు చేసుకుని మాతృభూమిలో మందిని సమకూర్చుకుంటే చాలదా అన్నట్లుంది బైరెడ్డి బాణి.