టెక్కలిలో తెదేపా నేత దారుణ హత్య

 

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తెదేపాకు చెందిన ఎమ్.పి.టి.సి. కోళ్ల అప్పన్నను ఈరోజు ఉదయం గుర్తు తెలియని కొందరు దుండగులు ఆయన జాతీయ రహదారిపై నడుచుకొంటూ వెళుతుండగా కత్తులు, కొడవళ్ళతో దారుణంగా నరికి చంపారు. మోహాలకు ముసుగులు ధరించిన కొందరు ఒక ఆటో, రెండు మోటార్ సైకిళ్ళపై వచ్చి ఆయనను హత్యచేసి పారిపోయినట్లు సమాచారం. ఆయనను ఎవరు హత్య చేసారు? ఎందుకు చేసారు? ఆయన హత్యకు రాజకీయ కక్షలు కారణమా లేకపోతే వేరే ఎవరితోనయినా వ్యాపార, భూ తగాదాలు వంటివి ఏమయినా కారణమా అనే విషయాలు పోలీసులు కనుగొనవలసి ఉంది. ఆయన మండపాలెం గ్రామంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు వెళుతున్న సమయంలో హత్యకు గురయినట్లు తెలుస్తోంది.