మున్సిపల్ బరిలో టీడీపీ... సందడిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్...

తెలంగాణ మున్సిపల్ పోరులో సత్తా చాటేందుకు తెలుగుదేశం సమాయత్తమవుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని... ఖమ్మం జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న టీడీపీ.... తన ఉనికిని కాపాడుకునేందుకు పాట్లు పడుతోంది. మరోవైపు, తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న చంద్రబాబు.... మున్సిపోల్స్‌ వ్యూహంపై టీటీడీపీ నేతలతో చర్చించారు. పోగొట్టుకున్న చోటే తిరిగి సాధించుకోవాలన్న సిద్ధాంతాన్ని మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసేందుకు వ్యూహరచన చేశారు. ఇప్పటికీ తెలంగాణ అంతటా టీడీపీకి క్యాడర్ ఉందని... అలాగే ప్రజల్లో తెలుగుదేశానికి ఆదరణ ఉందన్న చంద్రబాబు... నేతలు గట్టిగా కష్టపడితే మున్సిపోల్స్ లో మంచి ఫలితాలు వస్తాయంటూ దిశానిర్దేశం చేశారు. ఇకపై కచ్చితంగా వారంలో ఒకరోజు టీటీడీపీకి కేటాయిస్తానని, అందరం కలిసి తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేద్దామంటూ నేతల్లో ఉత్సాహం నింపారు.

అయితే, పార్టీనే నమ్ముకుని ఇప్పటికీ టీటీడీలో కొనసాగుతోన్న పలువురు నేతలు... మున్సిపల్ బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. టికెట్ల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు క్యూకడుతున్నారు. దాంతో, చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సందడిగా కనిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu