టీడీపీ శ్రేణులతో దద్దరిల్లిన తిరువూరు

కృష్ణాజిల్లా తిరువూరు పట్టణం సోమవారం టీడీపీ శ్రేణులతో దద్దరిల్లింది. పట్టణ టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రులు దేవినేని ఉమా, కె జవహర్‌లు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమానికి వచ్చిన టీడీపీ నాయకులకు తిరువూరు బైపాస్ రోడ్డులో గల అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి కె. జవహర్ బుల్లెట్ నడిపి కార్యకర్తలలో మరింత జోష్ నింపారు.

ఆ తర్వాత పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ కేశినేని నాని మిగిలిన నేతలు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి.. పట్టణ టీడీపీ కార్యాలయాన్ని వారు  ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూల నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu