మోత్కుపల్లి వద్ద కెసిఆర్ దీక్ష రహస్యలు ?
posted on Dec 28, 2011 2:12PM
హైదరాబా
ద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర రావు వైఖరిని నిరసిస్తూ బుధవారం గన్ పార్కు వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించుకోవడం, ఆయనను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. మోత్కుపల్లి రెండు రోజుల పాటు గన్ పార్కు వద్ద చేపట్టే దీక్షలో గతంలో కెసిఆర్ చేపట్టిన నిరాహార దీక్ష దొంగ దీక్ష అని అందుకు కావాల్సిన ఆధారాలను ఆయన బయటపెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.కెసిఆర్ దీక్ష సమయంలో ఆయనకు ఏ ఫ్లూయిడ్స్ ఎక్కించారు, వైద్యులు ఏయే జాగ్రత్తలు తీసుకున్నారనే వివరాలను మోత్కుపల్లి తెలంగాణ ప్రజల ఎదుటకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారట. అలాగే తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంత చారి తల్లి వ్యాఖ్యలను తప్పు పట్టకుండానే ఆమెతో టిఆర్ఎస్ అలాంటి వ్యాఖ్యలు చేయించిందని చెబుతూ, ఆత్మహత్యలు టిఆర్ఎస్ ప్రేరేపితాలుగా ఆధారాలు చూపించేందుకు ఆయన సిద్ధపడినట్లుగా తెలుస్తోంది.