కడప అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ దాడులు

కడప జిల్లా పాలకొండలు రిజర్వు ఫారెస్ట్ పరిధిలో  టాస్క్ ఫోర్స్ పోలీసులు  జరిపిన దాడులలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.50 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.  అలాగే రెండు మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు.  

కడప జిల్లా ఫారెస్ట్  రేంజి అన్నా సముద్రం ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల కూంబింగ్ లో భాగంగా   మామిళ్లపల్లి బీట్ పరిధిలోని పాలకొండలు అటవీ ప్రాంతంలో  శుక్రవారం (జూన్ 13) ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు.  వారిని కడప, అన్నమయ్య జిల్లా వాసులుగా గుర్తించారు. దుంగలు సహా పట్టుకున్న స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలు విలువ రూ. 40లక్షలు ఉంటుందని అంచనా వేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu