అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి.. నేతలకు కేసీఆర్ సూచనలు
posted on Sep 23, 2015 4:02PM
.jpg)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షనేతలు అడిగే ప్రశ్నలను ఎలా తిప్పికొట్టాలి అనే విషయంలో ఏ పార్టీ వ్యూహాలు ఆపార్టీకి ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీపై పలు రకాల ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షపార్టీలు ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు.. కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు తదితర అంశాలపై టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలని చూస్తుంది. అంతేకాదు గత అసెంబ్లీ సమావేశాల్లా కాకుండా ఈసారి మాత్రం పార్టీలన్నీ ఏకమై టీఆర్ఎస్ పార్టీపై దాడి చేయాలని చూస్తున్నాయి. దీనిలో భాగంగానే టీటీడీపీ కాంగ్రెస్ పార్టీ.. వైకాపా పార్టీ నేతలతో సంప్రదింపులు కూడా జరిపారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
అయితే వీళ్ల పనిలో వీళ్లు ఉంటే అటు కేసీఆర్ మాత్రం చాలా ధీమాగా ప్రతిపక్షనేతలకు భయపడాల్సిన అవసరం లేదని పార్టీనేతలకు చెప్పారంట. అయితే రైతుల ఆత్మహత్యల విషయంలో కూడా ప్రతిపక్షాల అనవసరం రాద్దాంతం చేస్తున్నారు కానీ వారి దగ్గర విషయం ఏం లేదు.. ఏదో అసెంబ్లీలో రచ్చ చేయడానికే ప్రయత్నిస్తున్నారని పార్టీ నేతలకు సూచించారట. అంతే కాదు అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేతలు అడిగే ప్రశ్నలకు జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పాలని.. అన్ని విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని.. వారి ఉచ్చులో పడకుండా ఉండాలని చెప్పారంట. మొత్తానికి పార్టీలన్నీ కలిసి ఎవరి ప్లానింగ్లో వాళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఎవరి ఎత్తులను ఎవరు పడగొడతారో.. చిక్కుకుంటారో చూడాలి మరి.