చిలకడదుంప ఎందుకు తినాలో చెప్పే నిజాలు ఇవి..!

 


ఆహారమే ఆరోగ్యం అంటారు. నేచురల్ ఫుడ్స్ ఎప్పుడూ శరీరానికి శక్తిని,  రోగనిరోధక శక్తిని కూడా ఇస్తాయి. శరీరానికి ఔషదంగా కూడా పనిచేస్తాయి. ఇలాంటి నేచురల్ ఫుడ్స్ లో కూరగాయలు, పండ్ల ప్రాధాన్యత ఎక్కువ. అటు దుంప కూరగాయగా పరిగణించబడుతూ ఇటు నేరుగా తినగలిగేది చిలకడదుంప.  దీన్ని స్వీట్ పొటాటో అని పిలుస్తారు.  చిలకడదుంపను కాల్చి,  ఉడికించి లేదా నేరుగా పచ్చిగా కూడా తింటుంటారు. చిలకడదుంపను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి అంటుంటారు. అయితే ఎందుకు తినాలో చెప్పే కొన్ని నిజాలు తెలుసుకుంటే.. చిలకడదుంపను తినడానికి మరింత ఇష్టపడతారు.  చిలకడదుంప ఎందుకు తినాలంటే..

బ్లడ్ షుగర్ కంట్రోల్..

చిలకడదుంప  రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ ఉంచడానికి  సహాయపడతాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ విలువ 44 నుండి 96  వరకు ఉంటుంది. ఇవి మితంగా తింటే  డయాబెటిస్ ఉన్నవారికి అనుకూలంగా ఉంటాయి. మాంగనీస్ కంటెంట్ కార్బోహైడ్రేట్ జీవక్రియకు సహాయపడుతుంది. చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, షుగర్ సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియకు..

చిలకడదుంపలలో  ఫైబర్ కంటెంట్ సమృద్దిగా ఉంటుంది.  ఈ కారణంగా ఇవి జీర్ణక్రియకు చక్కగా సహాయపడతాయి. చిలకడదుంపలో  పెక్టిన్ వంటి కరిగే ఫైబర్ (15-23%),  సెల్యులోజ్,  లిగ్నిన్తో సహా కరగని ఫైబర్ (77-85%) కూడా కలిగి ఉంటాయి. పెద్ద వ్యాధులను నివారించడానికి రోజూ 21-38 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

గుండెకు మంచిది..

చిలకడదుంపలలోని విటమిన్ బి 6 శరీరంలో హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. హోమోసిస్టీన్ స్థాయిలు ఎక్కువ ఉంటే   గుండెపోటు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.  ఇక చిలకడదుంపలోని  పొటాషియం కంటెంట్ ద్రవ సమతుల్యతను నిర్వహించడానికి,  రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి బూస్టర్లు..

ఆంథోసైనైడ్లు,  కోలిన్ వంటి శోథ నిరోధక సమ్మేళనాలు ఉండటం వల్ల చిలకడదుంపలు తింటే  రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఐరన్ కంటెంట్ ఒత్తిడి నిరోధకతను అందించడంలో సహాయపడుతుంది, ఎరుపు,  తెలుపు రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.  రోగనిరోధక పనితీరును నియంత్రిస్తుంది.

క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు..

చిలకడదుంపలలో యాంటీ క్యాన్సర్  లక్షణాలు ఉంటాయి.  వీటిలో అద్బుతమైన  యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా కెరోటినాయిడ్లు ఉంటాయి.  ఇవి  కడుపు, మూత్రపిండాలు,  రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని కనుగొనబడింది. ఊదా రంగు   చిలకడదుంపలలో  ప్రత్యేకంగా బ్లూబెర్రీలలో లభించే యాంటీఆక్సిడెంట్ల కంటే మూడు రెట్లు ఎక్కువ కెరోటినాయిడ్లు ఉంటాయి.

                                  *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu