సింగం పాటందుకుంది
posted on Aug 23, 2013 9:28PM

తెలుగు తో పాటు అన్ని భాషల హీరోలు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తుతున్నారు. అదే సింగర్ అవతారం. గతంలో కూడా చాలా మంది స్టార్‌లు ఇలాంటి ప్రయోగాలు చేసిన ఇటీవల మాత్రం ఈ ట్రెండ్ బాగా కనిపిస్తుంది. స్టార్ స్టేటస్ అందుకున్న స్టార్‌లందరు అడపా దడపా గొంతు సవరిస్తూనే ఉన్నారు.
ఇప్పటికే టాలీవుడ్ స్టార్‌లందరూ పాటేసుకోగా యంగ్ జనరేషన్ హీరోలు కూడా మేమేం తక్కువ కాదంటూ గళమెత్తారు. ఎన్టీఆర్, మనోజ్, సిద్దార్ద్ లాంటి హీరోలు సినిమాల్లో పాడుతుంటే రామ్‌చరణ్ మాత్రం చాన్నాల్ల కిందే ఓ పొలిటికల్ సాంగ్ పాడేశాడు. అయితే ఈ ట్రెండ్ తమిళ్‌లో పెద్దగా లేకపోయినా లోకనాయకుడు కమల్ మాత్రం ఎప్పుడో తనలోని సింగింగ్ టాలెంట్‌ను చూపించాడు.
తరువాత ఆదే స్థాయిలో యంగ్ హీరొ శింభు కూడా వరుస పాటలతో ఇరగదీస్తున్నాడు. అంతే కాదు ఈ మధ్యే సూపర్‌స్టార్ రజనీ కూడా ఓ పాట పాడేశాడు. దీంతో రేసులో తాను ఎక్కడ వెనుక పడతా అనుకున్నాడేమోగాని సూర్య కూడా పాట పాడేశాడు. అయితే సినిమా కోసం మాత్రం కాదు తాను యాక్ట్ చేస్తున్న ఓ కమర్షియల్ యాడ్ కోసం తొలి సారిగా తన గళం విప్పాడు సూర్య. ఇదే ఊపులో త్వరలో సినిమాలో కూడా పాటలు పాడేస్తాడేమో చూడాలి.