ఈద్గా మైదానంలో వినాయకచవితి ఉత్సవాలకు సుప్రీం నో
posted on Aug 31, 2022 7:06AM
కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. బెంగళూరులోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి ఉత్సవాలు నిర్వహించవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.వినాయక చవితి ఉత్సవాలను ఈద్గా మైదానంలో నిర్వహించుకునేందుకు కర్నాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దీంతో దీనిని వ్యతిరేకిస్తూ కర్నాటక వక్ఫ్ బోర్డు సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఈద్గా మైదానం వద్ద యథాతథ స్థితిని కొనసాగించాలని విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. వక్ఫ్ బోర్డు పిటిషన్ ను అత్యవసరంగా విచారించిన సుప్రీం కోర్టు వినాయకచవితికి సరిగ్గా ఒక్క రోజు ముందే అంటే మంగళవారం(ఆగస్టు30)న తీర్పు వెలువరించింది.
ఉత్సవ నిర్వహణపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆగస్టు 25న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయడంతో బెంగళూరులోని చామరాజ్‌పేటలోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థివేడుకలను నిర్వహించేందుకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించడంతో కర్ణాటక వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.