ఐక్య‌తారాగానికి తార‌క మంత్రం .. శ్రీ‌గ‌ణేషం!

గణేష్ చతుర్థి, వినాయక చవితి అని కూడా పిలుస్తారు, ఇది ప్రతి సంవత్సరం ప‌ది రోజుల పాటు జరుపుకునే పవిత్రమైన  పండుగ. ఈ పండుగను   భాద్ర‌ప‌ద‌ మాసంలో జరుపుకుంటారు, ఇది   ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో వస్తుంది.  ఏనుగు తలతో ఉండే గణేశుడు సంపద, శాస్త్రాలు, జ్ఞానం, జ్ఞానం,  శ్రేయస్సు ఇచ్చే దేవుడు అని పిలుస్తారు. అందుకే చాలా మంది హిందు వులు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు ఆయ‌న్ను త‌ల‌చుకుం టారు.  

ఆయ‌న ఆశీర్వాదాలను కోరుకుం టారు. గణేషుడిని గజానన, వినాయక, విఘ్నహర్త వంటి అనేకానేక‌ పేర్లతో పిలుస్తారు. గ‌ణేష చ‌తుర్ధి, గ‌ణేష పూజ అన‌గానే వ‌య‌సుతో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్ద అంద‌రూ ఎంతో భ‌క్తి, ఉత్సాహంతో పూజ‌చేస్తారు. ఆయ‌న అంద‌రికీ ఇష్టుడు. వినాయకుడిని ప్రార్థించిన భక్తులు తమ కోరికలు  నెరవేరుతారని నమ్ముతారు. గణేష్ చతుర్థి ప్రధాన సారాంశం ఏమిటంటే, ఆయనను ప్రార్థించే భక్తులు పాపాల నుండి విముక్తి పొందుతారు. అది వారిని జ్ఞాన మార్గంలో నడిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో భక్తి, సంతోషాలతో జరుపుకుంటారు. భారతదేశంలో, ఇది మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మధ్య ప్రదేశ్, కర్ణాటక , ఆంధ్ర‌, తెలంగాణ  రాష్ట్రాలలో ఎక్కువగా జరుపుకుంటారు.
చారిత్రాత్మకంగా, శివాజీ రాజు కాలం నుండి ఈ పండుగను జరుపుకుంటున్నాం. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలోనే లోక మాన్య తిలక్ గణేష్ చతుర్థిని ఒక ప్రైవేట్ వేడుక నుండి సమాజంలోని అన్ని కులాల ప్రజలు కలిసి, ప్రార్థనలు చేయ‌డం, ఐక్యంగా ఉండే గొప్ప పబ్లిక్ పండుగగా మార్చారు.  గణేష్‌ను ప్రతి ఒక్కరికీ దేవుడుగా భావించడం, గణేష్‌ను అగ్రవర్ణాలు, అట్టడుగు కులా ల వారు, రాజ‌కీయ నాయకులు వారి అనుచరులు ఒకే విధంగా పూజించారని తిలక్ గమనించారు. అతను గణేష్ చతుర్థిని జాతీయ పండుగగా బ్రాహ్మణులు బ్రాహ్మణే తరుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి తిల‌క్  ప్రచారం  చేశారు.
కొంతమంది భక్తులు ఈ పండుగను ఇంటి వద్ద జరుపుకుంటే, మరికొందరు బహిరంగ పందిళ్ల వద్ద గణేశుడిని దర్శించుకుంటారు.

ప్రజలు గణేశుడికి తగిన గౌరవం, ప్రార్థనలు,  నైవేద్యాలు సమర్పిస్తారు. గణేశుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాలువంటి వంట కాలు చేసుకుని దేవుని ప్ర‌సాదంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు,  సందర్శకులు తీసుకుంటారు. మొద‌టి రోజు నుంచి ప‌దో రోజు వ‌ర‌కూ అంతా వేడుకే. చిన్నా పెద్ద అంద‌రూ ఎంతో సంబ‌రంగా జ‌రుపుకునే పండుగ. దేశంలో అన్ని ప్రాంతాల్లో దాదాపు ప్ర‌తీ గ‌ల్లీలోనూ గ‌ణేష్ పందిళ్లు అద్భుతంగా అలంక‌రించి, త‌మ స్థోమ‌త‌కి తగ్గ‌ట్టు గ‌ణేషుని విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసుకుని ఎంతో ఆనం దోత్సాహాల‌తో పండుగ‌ను గొప్ప వేడుక‌గా జ‌ర‌పుకుంటారు. భ‌క్తిపాట‌లు, నృత్యాలు, పౌరాణిక నాట‌కాలు కూడా చాలా ప్రాంతాల్లో నిర్వ‌హిస్తుంటారు.

ముఖ్యంగా గ‌ణేషు మ‌హ‌త్యం, శివ‌మ‌హ‌త్యం, గ‌ణేష జ‌న‌నం గురించి అనేకర‌కాల పురాణ క‌ధా కాల‌క్షేపాలు  జ‌రుగుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ప‌దిరోజులూ సంగీత కార్యక్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. పిల్ల‌ల‌కు ఆట‌ల‌పోటీలు, ప‌ద్యాలు చ‌ద‌వ‌డం, శివ‌, గ‌ణేష శ్లోకాల ప‌ఠ‌న పోటీలు కూడా నిర్వ‌హించే సంప్ర‌దాయం ఆంధ్ర ప్రాంతంలో ఇప్ప‌టికీ జ‌రుగుతున్నాయి. ఎక్క‌డ‌యినాస‌రే గ‌ణేష చ‌తుర్ధి అన‌గానే అంద‌రూ క‌లిసి చ‌క్క‌గా నిర్వ‌హించ‌డం ప్ర‌జ‌ల మ‌ధ్య ఐక‌మ‌త్యాన్ని పెంపొందించే దిశ‌గా జ‌రుగుతుంది. 
యువ‌కులు మ‌రింత ఉత్సాహంగా ఈ రోజుల్లో సినిమాపాట‌ల స్ట‌యిల్లో గ‌ణేష భ‌క్తి పాట‌లు పాడుతూ స‌ర‌దాగా గ‌డ‌ప‌డం గ‌మ‌నిం చవ‌చ్చు. అదో ఆనందం, దానికి ప్ర‌త్యేకించి పేరు పెట్ట‌లేం. ఎవ‌రి ఆనందం వారిది. కానీ అంద‌రి ల‌క్ష్యం మాత్రం గ‌ణేషుని అపూర్వ ఆశీర్వాదం పొంద‌డ‌మే. పిల్ల‌లు చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న పందిళ్లు వేసుకుని పూజ‌లు చేయ‌డం ఇటీవ‌లి కాలంలోనూ చూడ గ‌లం. ఇదో అద్భుతం.  కాల‌క్ర‌మంలో రాజ‌కీయాల ప‌రంగా కూడా ఈ పండుగ నిర్వ‌హించే ప‌ద్ద‌తుల్లో మార్పులు గ‌మ‌నించ వ‌చ్చు.

చాలాప్రాంతాల్లో రాజ‌కీయ‌పార్టీలు, నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను త‌మ పార్టీల వేపు తిప్పుకోవ‌డానికి అనేక కొత్త ప‌ద్ధ‌తుల‌తో పండుగ‌ను నిర్వ‌హించ‌డం కూడా చూస్తున్నాం. ఇటీవ‌లికాలంలో బీజేపీ ఈ విష‌యంలో మ‌రింత శ్ర‌ద్ధ‌పెడుతోంది. భ‌క్తితో పాటు రాజ‌కీయ ల‌బ్ధి కూడా పొందే మార్గం ఆలోచిస్తున్నారు. భ‌క్తుల‌తోపాటు ఓట‌ర్ల‌ను కూడా ఆక‌ట్టుకోవ‌డానికి గ‌ణేష్ మండ‌పాలు, ప్రార్ధ‌నా మండ‌పాలు అనేక‌ర‌కాలుగా తీర్చిదిద్ద‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఏది ఏమ‌యిన‌ప్ప‌టికీ, గ‌ణేష్ ఉత్స‌వాలు ప‌ది రోజులు దేశంలో ప్ర‌జ‌లు అమితోత్సాహంతో భ‌క్తిపార‌వ‌శ్యంతో నిర్వ‌హించ‌డం, పాల్గొన‌డం గ‌మ‌నిస్తాం.  జై గ‌ణేషా

Online Jyotish
Tone Academy
KidsOne Telugu