ఇదే లాస్ట్‌ఛాన్స్.. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్..
posted on Sep 16, 2021 12:12PM
హమ్మయ్య. తెలంగాణ సర్కారు ఊపిరి పీల్చుకుంది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే, ఇదే చివరి అవకాశమని హెచ్చరించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. ఈ ఏడాదికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నామని స్పష్టం చేశారు.
వినాయక నిమజ్జనానికి మోడ్రన్ క్రేన్లు ఉపయోగించాలని.. నిమజ్జనం తర్వాత వెంటనే తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిమజ్జన చర్యలపై హైకోర్టుకు ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వాలని.. తదుపరి విచారణ హైకోర్టు చేపడుతుందని తెలిపింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు తీర్పుతో జీహెచ్ఎమ్‌సీకి ఊరట లభించినట్టైంది.
హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో ఇటీవల ప్రభుత్వ ఇరకాటంలో పడింది. తీర్పుపై అప్పీల్‌కు వెళ్లినా హైకోర్టు ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగర్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి అనుమతించమని తేల్చిచెప్పింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందేనని ఆదేశించింది. దీంతో.. అల్టర్‌నేట్ చర్యలపై దృష్టి సారిస్తూనే.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. సర్కారు విజ్ఞప్తిని మన్నించిన సుప్రీంకోర్టు.. ఈ ఒక్క ఏడాదికి హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనానికి అనుమిస్తూనే.. ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ హెచ్చరించడం కీలకపరిణామం. ఏది ఏమైనా.. ఈసారికి గండం తప్పినట్టైంది తెలంగాణ సర్కారుకు.