ప్రభుత్వ ప్రకటనలపై సుప్రీం సవరణ.. వారి ఫొటోలనూ వాడుకోవచ్చు..

ప్రభుత్వ ప్రకటనల్లో కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి ఫొటోలను మాత్రమే వాడాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అప్పట్లో కొన్ని అభ్యంతరాలు తలెత్తాయి. ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్లు కూడా దాఖలైనాయి. ఇప్పుడు వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కొన్ని సవరణలు చేస్తూ తీర్పును వెలువరించింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి ఫొటోలతో పాటు.. ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రుల ఫోటోలను కూడా ప్రచారాల్లో ఉపయోగించుకోవచ్చని తెలిపింది.