నాపేరు అడ్డదిడ్డంగా వాడేశారు.. కోర్టుకెక్కిన రజనీకాంత్

 

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కోర్టుకెక్కారు. ప్రస్తుతం హిందీ భాషలో రజనీకాంత్ జీవితం ఆధారంగా ‘మై హూ రజనీకాంత్’ అనే పేరుతో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాని తన అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని, తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని రజనీకాంత్ మద్రాసు హైకోర్టులో పిలిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా నిర్మిస్తున్నవారు తనను సంప్రదించడం గానీ, తన అనుమతి తీసుకోవడం గానీ చేయలేదని సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు ఈ కేసును  సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu