మరికొద్దిసేపట్లో అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ భూమ్మీదకు
posted on Mar 17, 2025 10:52AM
తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మరికొద్ది సేపట్లో భూమిని చేరుకోనున్నారు. ఆమెతో బాటు మరో వ్యోమగామి బుల్ విల్మోర్ చేరుకోనున్నారు. ఇప్పటికే అంతరిక్షంలో తిరుగు ప్రయాణానికి వీరు సిద్దమయ్యారు. సునీత విలియమ్స్ ను తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూడ్రాగన్ ఆదివారం(మార్చి 16) సక్సెస్ ఫుల్ గా భూ కక్ష్యలోని అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానమైంది. క్రూ మిషన్ లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒకరితర్వాత ఒకరు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు. వీరు వెళ్లడంతో సునీతా విలియమ్స్ రాక కన్ఫర్మ్ అయ్యింది. సునీతా విలియమ్స్ రిటర్న్ జర్నీ గూర్చి ఇప్పటికే నాసా ప్రకటించింది. అమెరికా కాలమాన ప్రకారం అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్ డాకింగ్ ప్రాసెస్ ప్రారంభమౌతుంది. సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు(మార్చి 17) అంతరిక్షకేంద్రం నుంచి క్రూడ్రాగన్ విడిపోయే ప్రాసెస్ ప్రారంభం కానుంది. స్పేస్ ఫిప్ విజయవంతంగా విడిపోయి మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు భూమ్మీదకు రిటర్న్ జర్నీ ప్రారంభమౌతుంది. సాయంత్రం 5.11 గంటలకు భూ కక్ష్య దాటుకుని క్రిందకు వచ్చి సాయంత్రం ఫ్లోరిడా తీరంలోని సముద్రజలాల్లో స్పేస్ ఎక్స్ క్యాపుల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరు (వ్యోమగాములు) దిగనున్నారు.
2024 జూన్ 5న ప్రయోగించిన వ్యోమనౌక ‘స్టార్ లైనర్ ’లో సునీతా విలియమ్స్ అంతరిక్షంలో అడుగుపెట్టారు. ప్లానింగ్ ప్రకారం వీరు వారంరోజులకే భూమ్మీదకు చేరుకోవాలి. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తెలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే భూమ్మీదకు స్టార్ లైనర్ వ్యోమనౌక తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి సునీతా విలియమ్స్ విల్మోర్ లు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.