వైసీపీ, బీజేపీ పొత్తు.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ నేత!

ఎన్డీయేలో వైసీపీ కలుస్తుందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో బీజేపీ ఏపీ ఇన్ చార్జ్ సునీల్ దేవోధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీతో ఎలాంటి పొత్తు ఉండదని ఎలాంటి అవగాహన కూడా లేదని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పటికే జనసేనతో కలిసి పని ప్రారంభించామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేనతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే.. ఇరు పార్టీలు తమకు విరుద్ధమేనని తమకు టీడీపీతో కానీ వైసీపీతో గానీ ఎలాంటి పొత్తు పెట్టుకునే ఉద్దేశాలు లేవని ఆయన వెల్లడించారు.

అదేవిధంగా తమకు ఎలాంటి ఇతర పార్టీల మద్దతు అవసరం లేదని కేవలం జనసేనతో మాత్రమే మద్దతుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు సునీల్ తెలిపారు. ఏపీలోని మరో రెండు పార్టీలతో మాకు ఎలాంటి ఒప్పందాలు లేవని ఆయన తెలివారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వైఫల్యాలతో తప్పుడు విధానాలను అవలంభిస్తొందని ఆయన స్పష్టం చేశారు. తాము ఇండిపెండెంట్ పార్టీగానే ఎదగడానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తామని ఆయన తెలిపారు. మొత్తానికి.. వైసీపీ.. బీజేపీకి మధ్య ఉన్న సంబంధాలను.. ఈ మధ్య నెలకొన్న ఊహాగానాలను సునీల్ దేవోధర్ స్పష్టం చేసినట్లే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu