రజనీ ఒక వేలిముద్రగాడు

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..వార్తల్లో నిలిచే బీజేపీ ఫైర్‌బ్రాండ్ సుబ్రమణ్యస్వామి ఈ సారి రజనీకాంత్‌ని లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోయారు. సూపర్‌స్టార్ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. రజనీకాంత్ ఒక నిరక్ష్యరాస్యుడు, ఆయన రాజకీయాలకు సరిపోరు..రాజకీయాల్లో ఎలా మెలగాలో తలైవాకు తెలియదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లోకి వస్తే ఇబ్బందికర పరిస్ధితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్వామి హెచ్చరించారు. అందుకే రజనీ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని నా సలహా అంటూ వ్యాఖ్యానానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట సంచలనం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సూపర్‌స్టార్ అభిమానులు స్వామిపై మండిపడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu