పురుగుల మందు తాగి ఎస్సై భార్య ఆత్మహత్య
posted on Jun 30, 2025 12:17PM
.webp)
పురుగుల మందు తాగి ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం రైల్వే ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెను వెంటనే ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం రాణాప్రతాప్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
ఇలా ఉండగా రాణాప్రతాప్ ది తొలి నుంచీ దుందుడుకు వ్యవహరించే తత్వమనీ, ఖమ్మంలో ట్రైనీగా ఉన్న సమయంలోనే ఆయన వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉండేదనీ చెబుతున్నారు. ఇలా ఉండగా ఆత్మహత్య చేసుకున్న రాణా ప్రతాప్ భార్య మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.