ఆదరణ లేక కళ తప్పిన ఆర్ట్స్ కోర్సులు

ఇంటర్మీడియట్ లో ఆర్ట్స్ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవలి కాలంలో ఆర్ట్స్ కోర్సులలో చేరే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. పడిపోతోంది.

ఇంటర్ లో ఆర్ట్స్ చదివే విద్యార్థులు తెలంగాణ, ఏపీ, తమిళనాడుల్లో 2% మంది మాత్రమే ఉన్నట్లు కేంద్ర విద్యా శాఖ ఇటీవల తెలిపింది. వివిధ రాష్ట్రాల సెకండరీ, హయ్యర్ సెకండరీ బోర్డు పరీక్షల్లో పాసైన విద్యార్థుల నిష్పత్తిని వివరిస్తూ విడుదల చేసిన జాబితాలో ఈ విషయాన్ని పేర్కొంది. త్రిపురలో 85%, గుజరాత్లో 82%, ఈశాన్య రాష్ట్రాల్లో 75% మంది విద్యార్థులు ఆర్ట్స్ కోర్సులు చదువుతున్నారు. సైన్స్ కోర్సులు చదివే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ (76% ), తెలంగాణ(65%), తమిళనాడు (62%)లలో అత్య ధికంగా ఉన్నారు. కర్ణాటకలో కామర్స్ కోర్సును అత్యధి కంగా 37% మంది ఎంచుకున్నారు. పదేళ్లుగా దేశవ్యాప్తంగా సైన్స్, ఆర్ట్స్ కోర్సులు బాగా ప్రజాదరణ పొందున్నాయి.

ఈ రెండు కోర్సుల వైపు మొగ్గు చూపే వారి సంఖ్య 2012లో 31శాతం ఉండగా 2022 నాటికి 40శాతానికి పెరిగింది. ఇదే సమయంలో కామర్స్ చేసే విద్యార్థుల సంఖ్య పదేళ్లుగా 14% కే పరిమిత మైంది. అన్ని కేటగిరీ విద్యార్థుల్లో 42% సైన్స్, 40% ఆర్ట్స్, 14% కామర్స్, 3% ఇతర కోర్సులు తీసుకుం టున్నారు. ఇక... అన్ని కేటగిరీ బాలికల్లో 46% ఆర్ట్స్, 38% సైన్స్, 14% కామర్స్, 2% ఇతర కోర్సు లను ఎంచుకుంటున్నారని కేంద్ర విద్యా శాఖ వివరిస్తోంది.  

ఓ వైపు ఎన్సీఈఆర్టీ .. చరిత్రలో ప్రముఖుల జీవిత చరిత్రలను, విజ్ఞాన సంబంధిత పాఠాలను తీసివేస్తోంది. మరో వైపు.. వాటిలో చేరే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి భారీగా తగ్గిపోతుంది. వర్తమానం, భవిష్యత్ గురించి తెలుసుకోవడానికి చరిత్ర దోహదపడుతుంది. ఆర్ట్స్ పై అయిష్టత .. రాబోవు తరానికి ఓ పెద్ద మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం, విద్యా శాఖ ..ఆర్ట్స్ పై విద్యార్థులకు అవగాహన, ఆసక్తి కలిగేలా చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.