విద్యార్థినిపై కొడవలితో దాడి

 

హైదరాబాద్ శివార్లలోని బండ్లగూడ అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థి మరో విద్యార్థినిపై కొడవలితో దాడి చేసి గాయపరిచాడు. తనను ప్రేమించడం లేదనే సాకుతో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రవళిపై ప్రదీప్ అనే యువకుడు కత్తితోదాడి చేశాడు. దాడి చేసిన తర్వాత ప్రదీప్ విషం తాగాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.