పోలీసుల నీడలో ఓయూ

హైదరాబాద్: బంద్‌ సందర్భంగా హైదరాబాద్‌లో ఓయూ క్యాంపస్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ముందు జాగ్రత్తగా క్యాంపస్‌లో భారీగా బలగాలను మోహరించారు. ఉప్పల్‌, తార్నాకా, ఎల్బీనగర్‌, ఈసీఐఎల్లో వ్యాపారసంస్థలు, పెట్రోల్‌బంక్‌లను దళిత సంఘాల నేతలు బలవంతంగా మూసివేయించారు. బస్సుల రాకపోకలు నిలిచిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంబేద్కర్‌ విగ్రహాల విధ్వంసానికి నిరసనగా సోమవారం రాష్టవ్య్రాప్తంగా బంద్‌కు దళిత సంఘాలు, తెలంగాణ విద్యార్థి ఐకాస, కుల వివక్ష పోరాట రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన విషయం విదితమే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu