సరోగసి కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు

 

సృష్టి కేసు ఇంకా దర్యాప్తులో ఉండగానే..మరో అక్రమ సృష్టి బయటపడింది. మహిళలను అంగట్లో సరుకుల మార్చి అమ్మత నాన్ని అమ్ముకుంటు న్నారు.అమాయకమైన మహిళలను టార్గెట్ చేసుకొని వారి దందా కొనసాగిస్తూ లాభాలు గడిస్తున్నారు.ఇప్పడు తాజాగా మేడ్చల్ కేంద్రంగా చేసుకొని అక్రమ సరోగసి దందా కొనసాగిస్తున్న కిలాడి ఎస్ఓటి బృందం చేతికి చిక్కిన విషయం తెలిసిందే... ఈ కేసులో సంచలన మైన విషయాలు  బయటపడుతున్నాయి. నిన్న ఎస్ఓటి బృందం మేడ్చల్ జిల్లా పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా సరోగసి దందా కొనసాగిస్తున్న నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

అంతేకాకుండా పోలీసులు సరోగసి తల్లులకు నోటీ సులు కూడా పంపించారు. అయితే నింది తురాలు లక్ష్మి గతంలో పిల్లల విక్రయాలు సరోగసి కేసులో ముంబై పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మి తన కుమారుడు నరేందర్ రెడ్డి మరియు కూతురు తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు... నగరాన్నికి వచ్చిన నిందితురాలు లక్ష్మి మళ్ళీ అదే దందా కొనసాగించింది. లక్ష్మి పలు ప్రవేట్ హాస్పిటల్స్ మరియు ఐవీఎఫ్ సెంటర్లకు ఏజెంట్‌గా వ్యవహరిస్తుంది ఎవరైనా దంపతులు సరోగసి పద్ధతిలో పిల్లల కోసం హాస్పటల్స్ సెంటర్లను ఆశ్రయించగా వాళ్ల ఏజెంట్లు లక్ష్మికి సమాచారం ఇస్తారు.

ఆ విధంగా లక్ష్మి  ఐవీఎఫ్ సెంటర్ కు వెళ్ల దంపతుల వివరాలు ఏజెంట్ల ద్వారా సేకరించేది. అనంతరం ఆర్థిక పరిస్థితి బాగోలేని మహిళలను టార్గెట్‌గా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి బలవం తంగా సరోగసికి ఒప్పించేది. ఆ తర్వాత పిల్లల కోసం తాపత్రయం పడుతున్న దంప తులను టార్గెట్‌గా చేసుకొని... వారికి మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి 20 నుండి 25 లక్షల వరకు డబ్బులు వసూలు చేసేది. కానీ సరోగసి తల్లులకు మాత్రం ఐదు నుండి నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చేది. అంతేకాకుండా నిందితురాలు లక్ష్మి సరోగసి తల్లులకు డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ బాండ్ రాయించు కునేది.

 ఇలా ఇప్పటివరకు ఎనిమిది మంది సరోగసి తల్లుల చేత ప్రామిసరీ బాండ్ రాయించుకున్నది. ఇప్పుడు పోలీసులు వారందరికీ నోటీ సులు జారీ చేశారు. లక్ష్మి మరియు ఆమె కుమారుడ్ని పోలీసులు అరెస్టు చేసి... ఇంట్లోఉన్న  ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు  గర్భాదారణ మందులు  హార్మోన్ ఇంజక్షన్లు లతో పాటు  హెగ్డే హాస్పిటల్ తో సహా అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్ ఐవిఎఫ్ ,ఫర్టి కేర్ ,శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించిన కొన్ని రిపోర్ట్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు పోలీసులు పలు ఐ వి ఎఫ్ హాస్పిటల్స్ తో లక్ష్మి కి ఉన్న సంబంధాల పై ఆరా తీస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu