ప్రకాష్ రాజ్ ను మెచ్చుకున్న స్పీల్ బర్గ్
posted on Mar 26, 2013 3:29PM

హాలీవుడ్ లో గొప్ప దర్శకుడిగా పేరున్న స్టీవెన్ స్పీల్ బర్గ్ తాను చూసిన చిత్రంలో ఆ నటుడి నటనను ప్రశంసిస్తే ఆ నటుడు ఎంత హ్యాపీగా ఫీలవుతాడో ఊహించలేం. సరిగ్గా ఇదే అనుభవం ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు దక్కింది. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ముంబయి వచ్చిన స్పీల్ బర్గ్ గౌరవార్ధం ఓ విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు ఆహ్వానం అందుకున్న ప్రకాష్ రాజ్ అక్కడికి వెళ్లాడట. విందులో ప్రకాష్ రాజ్ ను చూసిన వెంటనే గుర్తుపట్టిన స్పీల్ బర్గ్ “నేను మీరు నటించిన ‘కాంజీవరం’ సినిమా చూశాను. అందులో మీ నటన అద్భుతం. కేవలం కళ్లతోనే అద్భుతమయిన హావభావాలు పలికించారు. చాల కష్టమయిన పాత్ర. అయినా చాలా బాగా మెప్పించారు” అని అన్నారట. అంతే స్పీల్ బర్గ్ గుర్తుపడితే చాలనుకుంటే..ఏకంగా తన సినిమా, అందులో నటన గురించి మాట్లాడేసరికి ప్రకాష్ రాజ్ షాక్ తిన్నాడట.