చేగువెరగా నటించనున్న ప్రభాస్

 

 

 

 

 

 

 

 

మిర్చి సినిమా విజయవంతం అవడంతో మంచి ఊపు మీదున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, తరువాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న జానపద చిత్రం ‘బాహుబలి’ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోకూడా అనుష్క అతనితో జత కట్టబోతోంది. ఇక, ప్రభాస్ త్వరలో మొదలు పెట్ట నున్న మరో చిత్రం పేరు ‘ఒక్క అడుగు’. గతంలో అతను నటించిన సూపర్ హిట్ సినిమా ‘చత్రపతి’లో కోటా శ్రీనివాసరావును ఎదుర్కొంటూ ప్రభాస్ పలికిన డైలాగుల్లో బాగా పాపులర్ అయిన ‘ఒక్క అడుగు’ అనే డైలాగునే ఈ సినిమాకు పేరుగా నిర్ణయించారు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు మొట్ట మొదటిసారిగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అర్జెంటిన దేశ విప్లవ నాయకుడు చేగువెర పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో దాదాపు 20నిమిషాల సేపు ఆ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు. చేగువెరను చాల అభిమానించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన సినీ జీవితంలో కనీసం ఒక్కసారయినా చేగువెరగా నటించాలని కోరుకొంటున్నట్లు మీడియాకు చాల సార్లు చెప్పినప్పటికీ, ఆయన కంటే ముందుగా ప్రభాస్ కు ఆ అవకాశం దక్కింది. ఈ సినిమాను కృష్ణంరాజే తన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి పూర్తీ వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu