రెండు ప్రమాదాలు.. రెండు కుటుంబాలు...
posted on Dec 27, 2014 4:24PM

సౌదీ అరేబియా దేశంలో శనివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారు. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి పోలీసులు కడప జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రొద్దుటూరులోని మృతుల బంధువులు కన్నీటిపర్యంతం అయ్యారు. అలాగే నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామ శివారులో కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులు బొమ్మలరామారం మండలం యావాపూర్ తండాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.