మసాజ్ సెంటర్లలో....
posted on Dec 27, 2014 4:11PM

హైదరాబాద్‌లో మసాజ్ సెంటర్లకు కొదువ లేదు. థాయిలాండ్ మసాజ్ చేయించుకోవాలంటే కష్టపడి థాయిలాండ్ వరకూ వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లోనే థాయిలాండ్ దర్శనం చేయించగల చేయి తిరిగిన లేడీ మసాజర్లు హైదరాబాద్‌లో బోలెడంతమంది వున్నారు. మసాజ్ సెంటర్లు కూడా తక్కువేమీ లేవు. హైక్లాస్ ఏరియాల్లో అయితే సందుకో మసాజ్ సెంటర్ కనిపిస్తుంది. అయితే చాలా మజాస్ సెంటర్లు, స్పాలు పైకి చెప్పేదొకటి లోపల జరిగేదొకటి. అందుకే అప్పుడప్పులు పోలీసులు మసాజ్ సెంటర్ల మీద దాడులు జరిపి లోపల జరిగే లోపాయికారీ కార్యక్రమాలను బయటపెడుతూ వుంటారు. అలాంటి సందర్భం శనివారం మరోసారి వచ్చింది. గచ్చిబౌలీలోని మసాజ్ సెంటర్లు, స్పాల మీద వెస్ట్ జోన్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మసాజ్ సెంటర్లలో ఎలాంటి భాగోతాలు బయటపడి వుంటాయో ఊహించుకోగలరు. ఈ దాడుల సందర్భంగా మసాజ్ చేసే 20 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ‘మసాజ్’ చేసే వారిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళారు బాగానే వుంది. మరి ‘మసాజ్’ చేయించుకున్న వారు ఏమయ్యారు? ఆ ప్రశ్న మీరు అడక్కూడదు.. అడిగినా పోలీసులు చెప్పరు.