‘S/O సత్యమూర్తి’ ఫంక్షన్‌కి పవన్ రాడట...
posted on Mar 15, 2015 9:22PM

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘S/O సత్యమూర్తి’ ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం నాడు హైదరాబాద్‌లో జరుగుతోంది. అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యా మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే ఒకపక్క ఆడియో ఫంక్షన్ జరుగుతోంటే, చాలామంది పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ పాల్గొనడం లేదని తెలుస్తోంది. మొదట వస్తానని మాట ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత ఆయన రానని చెప్పినట్టు సమాచారం.