మోడీపై సోనియా ఫైర్.. మీ మాటల వల్ల కడుపునిండదు...
posted on May 8, 2018 6:05PM
.jpg)
ఇంకో నాలుగు రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇక చాలా కాలం తర్వాత యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బెంగళూరులో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న ఆమె ప్రధాని మోదీపై ఆమె విమర్శల వర్షం కురిపించారు. ఈనెల 12న జరిగే ఎన్నికల్లో బీజేపీ విఫలమవుతుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కన్నడ ప్రజానీకం ఘన విజయాన్ని అందించబోతున్నారని.... ప్రసంగించడంలో ప్రధాని మోదీ మంచి నేర్పరి అని... అయితే ఆయన ప్రసంగాలు పేదల కడుపు నింపవని, అనారోగ్యం నుంచి కాపాడలేవని ఎద్దేవా చేశారు. కడుపు నిండాలంటే అన్నం, పప్పు కావాలని, అరోగ్యం కావాలంటే హెల్త్ సెంటర్లు కావాలని చెప్పారు. పేదలకు కూడా మంచి ఆహారం ఉండాలనే గొప్ప లక్ష్యంతో సిద్ధరామయ్య ప్రభుత్వం సబ్సిడీపై ఆహారాన్ని అందించిందని సోనియా అన్నారు.