మంచి చేయాలనే పవన్ పార్టీ పెట్టారు..కానీ..!

 

సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ గతకొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వంపై..ముఖ్యంగా మోడీపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గురించి మాట్లాడారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టారని, ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నిస్తోన్న పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానిద్దామని.. అయితే జనసేనలోకి వచ్చే వలస నేతలతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వలసనేతలు మోసం చేసే ప్రమాదం ఉందని అన్నారు. అంతేకాదు ఎప్పటిలాగే మోడీపై విమర్శలు గుప్పించారు.  ప్రధాని మోదీలా అసత్యాలు చెప్పే వారిని తాను ఎక్కడా చూడలేదని, తాము సర్కారుని ప్రశ్నిస్తోంటే వారు వ్యక్తిగత విషయాలపై మాట్లాడుతున్నారని.. ప్రశ్నిస్తున్నందుకే తనకు నటించడానికి కమర్షియల్ యాడ్స్ కూడా రావడం లేదని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu