‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో విడుదల
posted on Mar 16, 2015 6:40AM

అల్లు అర్జున్, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, సమంత, నిత్యామీనన్, స్నేహ, అదాశర్మ ప్రధాన తారాగణంగా హారిణి & హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో వైభవంగా జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఈ సినిమా సంగీతాన్ని ఆవిష్కరించారు. ఈ ఆడియో వేడుకలో సినిమా యూనిట్ సభ్యులతోపాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి పేరు సత్యమూర్తి. ప్రముఖ సినీ రచయిత అయిన ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమా ఆడియో వేడుక ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది.