డబ్బుల కోసం తల్లిని చంపి.. చివరికి.. 

మల్లేష్, స్వరూప ఇద్దరు దంపతులు. వారి కుమారుడు హరి. అతని వయసు 26 సంవత్సరాలు. వారిది కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం రాసపల్లి. బతుకు దెరువుకోసం  30 ఏళ్ల కిందట నగరానికి వచ్చి హైదరాబాద్ కి వచ్చారు. చింతల్ పరిధి లో భగత్ సింగ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. మలేష్ సనత్ నగర్ లో  టైలరింగ్‌ దుకాణంతో జీవనం సాగిస్తున్నాడు. భార్య స్వరూప కూడా ఇంటి వద్ద టైలరింగ్‌ చేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు హరి(26). కుమార్తెలకు వివాహం జరిపించారు. హరి ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. రెండేళ్లుగా ఓ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు ఇంట్లోవారిని నమ్మించి ఉదయం టిఫిన్‌తో వెళ్లి సాయంత్రం తిరిగొచ్చేవాడు. ఇంట్లో పైసా ఇవ్వకపోగా దుబారా ఖర్చుల కోసం తల్లిదండ్రులను వేధించేవాడు.  

మల్లేష్‌ ప్రతిరోజులాగే సోమవారం ఉదయం మల్లేష్‌ హరిని ద్విచక్రవాహనంపై బాలానగర్‌ నర్సాపూర్‌ కూడలిలో వదిలి వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి స్వరూప విగతజీవిగా పడి ఉంది. మెడకు టవల్‌తో ఉచ్చు బిగించి ఉంది. వెంటనే కుమారుడికి ఫోన్‌ చేయగా, బాలానగర్‌లో ఉన్నానని వస్తున్నానని చెప్పాడు. మంగళవారం మల్లేష్‌ జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె ఒంటిపై పుస్తెలతాడు, ఇంట్లో బంగారు నగలు, నగదు కనిపించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు నగల కోసం హత్యచేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు.   

ఇంట్లోని పైఅంతస్థులో మల్లేష్‌ కుటుంబం నివాసముంటుండగా కింద రెండు పోర్షన్లు అద్దెకిచ్చారు. మధ్యాహ్నం భర్త ఫోన్‌ చేసినప్పుడు ఎప్పుడూ సందడిగా ఉండే ఇరుకైన వీధి, ఇంట్లో కింది పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న కుటుంబాలకు అలికిడి లేకుండా దొంగలు వచ్చే అవకాశం లేకపోవడంతో జులాయిగా తిరిగే హరిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు చింతల్‌ నుంచి బాలానగర్‌ వరకు సీసీ కెమెరాలను పరిశీలించగా హరి ఆ చుట్టుపక్కలే తచ్చాడినట్లు తేలింది. అతడిని విచారించగా నగల కోసం హత్య చేసినట్లు తేలింది.  

జనాల్లో విలువలు లేకుండా పోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు తాము చనిపోవడం, ఇంట్లో వాళ్ళను చంపడం లాంటి అఘాయిత్యాలకు పాలుపడుతున్నారూ. ఇలాంటి కేసులు రోజులు రోజుకి పెరిగిపోతున్నాయి. పని చేయకపోగా ఇంట్లో వాళ్ళదగ్గరే డబ్బులు అడగడం వాళ్ళు ఇవ్వకపోవడంతో వారిమీద కక్ష తీసుకోవడం. వారిని కడతేర్చడం మనం రోజు చూస్తున్నాం.