కొడుకు కాదు.. యముడు!

 

తన కొడుకు తనకు పున్నామ నరకాన్ని తప్పిస్తాడని ఆ తండ్రి భావించాడు.. అయితే ఆ కొడుకు యముడిలా మారి తండ్రి ప్రాణాలు తీసేశాడు. చిత్తూరు జిల్లా మేళ్ళచెర్వులో నివసించే కేశవరెడ్డి, విశ్వనాథరెడ్డి అనే తండ్రీ కొడుకుల మధ్య గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. శనివారం నాడు ఈ విషయం మీద వీళ్ళిద్దరూ బాగా పోట్లాడుకున్నారు. విశ్వనాథ్‌రెడ్డికి ఆవేశం పెరిగిపోయి తన తండ్రి మీద దాడి చేయడంతో కేశవరెడ్డి తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ సంఘటనను చూసిన పక్కింట్లో వుండే కృష్ణయ్య విశ్వనాథరెడ్డిని నిలదీయడంతో పట్టలేని కోపంతో విశ్వనాథరెడ్డి కృష్ణయ్యని కూడా చంపేశాడు. దాంతో గ్రామస్థులు విశ్వనాథరెడ్డిని కట్టేసి కొట్టారు. దాంతో అతను చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్షణికావేశం రెండు ప్రాణాలను బలితీసుకుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu