పొన్నాలా.. చేసింది చాలు ఇక దయచెయ్!
posted on Aug 2, 2014 2:38PM
.jpg)
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మీద మాటల దాడిని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆపేట్టు లేరు. కోమటిరెడ్డి ఇప్పటికే ఎన్నోసార్లు పొన్నాల మీద మాటల దాడి చేశారు. పొన్నాల కిక్కురుమనకుండా వుంటున్నప్పటికీ కోమటిరెడ్డి ఆయన మీద మాటల దాడిని ఆపడం లేదు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు కాంగ్రెస్ పార్టీని సమీక్షించే, పార్టీని నడిపించే అర్హత లేదని కోమటిరెడ్డి అంటున్నారు. ఎన్నికలలో ఓడిపోయిన వ్యక్తి పార్టీని ఎలా పడిపిస్తారని కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. పొన్నాల చేస్తున్న పీసీసీ సమీక్షా సమావేశాలతో ఒరిగేదేమీ లేదని, పీసీసీ అధ్యక్షుడి హోదాలో పొన్నాల ఊడబొడిచేది కూడా ఏమీ లేదని ఆయన అంటున్నారు. అందువల్ల పొన్నాల అర్జెంటుగా తన పదవికి రాజీనామా చేసి కొత్తారికి అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తమ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్ళనున్ననని ఆయన తెలిపారు.