ఇదెక్కడి చోద్యం?.. విమర్శల్లోనూ వివక్షా?

ఈ యాక్టివిస్టులున్నారే! త‌న మ‌న బేధాలు పాటించ‌డం వీరికి పెన్నుతో పెట్టిన విద్య‌. వివ‌క్ష చూప‌డం అన్న‌ది వీరికి మైకుతో వ‌చ్చిన ఆర్టు. ఇటీవ‌ల త‌మిళ‌నాడు కేంద్రంగా రెండు ప్ర‌ధాన దుర్ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. వాటిలో మొద‌టిది.. క‌రూర్ లో జ‌రిగిన‌  తొక్కిస‌లాట కాగా.. మ‌రొక‌టి  త‌మిళ‌నాడులో త‌యారు చేసిన దగ్గుమందు కార‌ణంగా మ‌ధ్య ప్ర‌దేశ్, రాజ‌స్థాన్ లో కొంద‌రు పిల్ల‌లు చ‌నిపోవ‌డం. వీటిపై మ‌న ద‌గ్గ‌రున్న యాక్టివిస్ట్ బ్యాచ్ క‌నీపం స్పందించలేదు.  అదే   బీజేపీ  కూట‌మి పార్టీ నేత‌లు చేసే త‌ప్పొప్పుల మీద వీళ్ల బాదుడు.. ఒక రేంజ్ లో ఉంటుందంటే అతిశ‌యోక్తి కాదు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైర‌ల్ జ్వ‌రాన్ని కూడా వ‌ద‌ల‌కుండా వాయించేస్తారు. అదే విజ‌య్ కరూర్ రోడ్ షో కారణంగా  41 మంది చ‌నిపోయారు. అయితే ఈ సంఘటనపై సోకాల్డ్ యాక్టివిస్టులు కనీసం స్పందించను కూడా స్పందించలేదు. 

అదే బీజేపీ కేంద్రంగా ఏదైనా చీమ చిటుక్కుమ‌న్నా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తుమ్మినా ద‌గ్గినా కూడా వీరి యాంటీ ర్యాగింగ్ క్యాంపెయినింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఆ మాట‌కొస్తే మొన్న మోడీ మ‌ణిపూర్ కి వెళ్లిన‌పుడు కూడా ఘ‌ట‌న జ‌రిగిన ఇన్ని రోజుల‌కు, ఇన్ని గంట‌ల‌కు, ఇన్ని గ‌డియ‌ల‌కు ఆయ‌న‌క్క‌డ‌కు వెళ్ల‌డ‌మా అంటూ సెక‌న్ల‌తో స‌హా లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీసి మ‌రీ పోస్టులు పెట్టారీ పెద్ద మ‌నుషులు. అలాంటిది విజ‌య్ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించడంపై ఎందుకు స్పందించడంలేదు?  అంటే ఇక్క‌డే ఉంది అస‌లు లాజిక్కు.. ఇక్క‌డ విజ‌య్ కూడా సేమ్ టూ సేమ్ వీరిలాగానే బీజేపీని వ్య‌తిరేకిస్తారు కాబట్టి.  త‌న సినిమాలో సీన్లు పెట్టిమ‌రీ ఆయ‌న యాంటీ బీజేపీ వాయిస్ వినిపిస్తారు కనుక. 

తాజాగా త‌మిళ‌నాడు కు చెందిన ఒక కంపెనీ త‌యారు చేసిన విష‌పూరిత ద‌గ్గుమందు ద్వారా పిల్ల‌లు చ‌నిపోతే.. అదేంటో తెలీదు జ‌స్ట్ ఆస్కింగ్ ప్ర‌కాష్ రాజ్ ప‌త్తా లేరు. ఇక డీఎంకే ద్వారా ఎంపీ అయిన క‌మ‌ల్ హాస‌న్ క‌నిపించ‌రు. ఇక స‌నాత‌న ధ‌ర్మం అంటే విరుచుకుప‌డే స‌త్య‌రాజ్ మాట పెగ‌ల‌దు. అంటే ఇక్క‌డ వివ‌క్ష‌పై పోరాటం చేసే ఈ యోధాను యోధుల గ‌ళం, క‌లం కొన్నిసార్లంతే అదేంటో తెలీదు.. ఆటోమేటిగ్గా మూగ‌పోతాయి. వీరి దృష్టిలో కరూర్ తొక్కిసలాట అయినా, దగ్గుమందు వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటన అయినా  య‌ధాలాపంగా జరిగినవే. గ‌ట్టిగా నిల‌దీస్తే.. వీటి వెనుక కూడా  బీజేపీ కుట్ర అంటూ బుకాయించినా ఆశ్చ‌ర్యం లేదు. ఇదే ప్ర‌కాష్ రాజ్ అయోధ్య‌లో బాబ్రీ మ‌సీదు కూల‌దోసి మ‌రీ అక్క‌డ రామ మందిరం నిర్మించారని తీవ్రఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తారుగానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ కూలిన దేవాల‌యాల సంఖ్య అస్స‌లు ప‌రిగ‌ణ‌లోకి తీస్కోరు. 

ఇక దేవుడు లేనే లేడ‌నే క‌మ‌ల్ హాస‌న్ కి విజ‌య్ పార్టీ రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిస‌లాట కార‌ణంగా పోయిన ప్రాణాల‌కు విలువ లేన‌ట్టే బిహేవ్ చేస్తారు. ఆపై త‌మ రాష్ట్రంలో త‌యారైన ద‌గ్గు మందు కార‌ణంగా చ‌నిపోయిన పిల్ల‌ల విషయంలో అసలు అలాంటి సంఘటనే జరగలేదన్నట్లుగా  స‌త్య‌రాజ్ సైలెంటైపోతారు. ఇక్క‌డ కూడా అంతే తెలుగులో కొంద‌రు యాక్టివిస్టులుంటారు. వీరు కూడా కేవ‌లం హిందుత్వ‌, ఎన్డీయే, కూట‌మి ద్వారా జ‌రిగే త‌ప్పొప్పుల మీద మాత్ర‌మే దృష్టి సారిస్తారు. మిగిలింది ఏమైనా  కానీ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయిన్ టైన్ చేస్తారు. ఇదెక్క‌డి విడ్డూర‌మో అర్ధం  కాదంటారు కొంద‌రు సామాజిక‌వేత్త‌లు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu