స్మృతి ఇరానీ: ట్రైల్ రూమ్‌లో కెమెరాలు...

 

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానికి గోవాలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఇటీవల సెలవులను స్పెండ్ చేయడానికి గోవాకి వెళ్ళారు. అక్కడ కలాంగుటె అనే ప్రాంతంలో గల బొటిక్కు బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఆమె దుస్తులు కొన్న తర్వాత దుస్తులు మార్చుకునే ట్రైల్ రూంలోకి వెళ్ళాక అక్కడ ఆమెకు రహస్య కెమెరాలు ఉన్న విషయం బయటపడింది. దాంతో ఆమె ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. స్మృతి ఇరానీ స్వయంగా వెళ్లి పోలీసులకు తన స్టేట్మెంట్ ఇచ్చారు. కేంద్ర మంత్రి వెళ్లిన దుకాణంలో ట్రైల్ రూమ్‌లో ఇలా రహస్య కెమెరాలు కనిపించడంతో సంచలనం రేగింది. సదరు బోటిక్ మీద మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన నేరం మీద గోవా పోలీసులు కేసు పెట్టారు. అసలు ఆ కెమెరాలను ట్రైల్ రూమ్‌లో ఎవరు పెట్టారో దర్యాప్తు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu