పార్టీ టికెట్ దక్కలేదని సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య

ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడుకు రాష్ట్రానికి చెందిన సిట్టింగ్ ఎంపీ గణేష్ మూర్తి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈడోర్ నియోజకవర్గ ఎండీఎంకే ఎంపీ గురుమూర్తికి పార్టీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేదు. దీంతో  ఆయన మూడు రోజుల కిందట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ( మార్చి 28) ఉదయం కన్నుమూశారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మరణించారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.  

ఎండీఎంకే పార్టీ అభ్యర్థిగా  గణేశమూర్తి 2019 పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోడ్ నుండి భారీ మెజార్టీతో  విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.  ఎన్నికలలో పోటీకి అవకాశం లేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యకు పాల్పడటం తమిళనాట మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.