న్యాయవాదిపై కాల్పులు

పట్టపగలే ఒక న్యాయవాదిపై న్యాయస్థాన ఆవరణలో కాల్పులు జరిగాయి. అలహాబాద్ లో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకొంది. దీంతో పలువురు స్థానిక న్యాయవాదులు పోలీసులపై, కోర్టు సిబ్బందిపై రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన న్యాయవాది మహ్మద్ నబీని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన న్యాయవాది చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu