విజయవాడలో శోభన్‌బాబు కాంస్యవిగ్రహం

 

విజయవాడలోని గాంధీనగర్ సెంటర్లో దివంగత నటుడు శోభన్‌బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శోభన్‌బాబు అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఎంపీ మురళీమోహన్, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శోభన్‌బాబుతో తనకున్న అనుబంధాన్ని మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు. శోభన్‌బాబు సినిమాల్లో నటించడం మానేసినా, ఆయన మరణించినా ఆయన అభిమానులు ఆయనను మరచిపోలేరని మురళీమోహన్ చెప్పారు. నటుడిగా ఎంతో క్రమశిక్షణ కలిగిన శోభన్‌బాబును చూసి ఈ తరంవారు నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో వున్నాయని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu