సెంచరీ చేసిన షర్మిల

 

వైయస్.జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల గత ఏడాది అక్టోబర్ 18న కడప జిల్లా ఇడుపులపాయలో మొదలు పెట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయత్రకు ఆదివారంతో 100 రోజులు పూర్తయ్యాయి. 14 వందల కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో ఆమె ఇప్పటివరకు 7 జిల్లాలలో, 43 అసెంబ్లీ నియోజకవర్గాలు, 750 గ్రామాలలో ప్రజలను కలిసారు. మద్యలో మోకాలి గాయానికి శస్త్రచికిత్స నిమిత్తం రెండు నెలలు విశ్రాంతి తీసుకొన్న ఆమె, తిరిగి తన పాదయాత్రను ఫిబ్రవరి 6న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజాల్ నుంచి మొదలుపెట్టి నాటి నుండి నేటి వరకు నిర్విరామంగా(యంయల్సీ ఎన్నికల వలన మద్యలో రెండు రోజులు పాదయాత్రకు విరామం ఈయవలసివచ్చింది.) తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆమెకు పాదయాత్ర 100రోజులు పూర్తైన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం గుంటూరు జిల్లా మంగళ గిరిలో బస్టాండ్ సెంటరు వద్ద ఒక భారీ బహిరంగ సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతోంది. ఆ సభలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మరియు ఆ పార్టీ నేతలు పాల్గొంటారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu