కోదండరామ్ ఉద్యోగం ఊడనట్లే

 

 

 kodandaram telangana, telangana issue, sadakbandh kodandaram

 

 

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఉద్యోగం విషయంలో చాలా రోజులుగా వివాదం నడుస్తుండటం తెలిసిన విషయమే. ఒకవైపు ప్రభుత్వం నుంచి జీతం అందుకుంటూనే…ఈ ప్రభుత్వానిది దురహాంకారమని, దుర్మార్గపు ప్రభుత్వమని కోదండరాం విమర్శిస్తారని, ఆయన ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని అనేక విమర్శలు ఎదురయ్యాయి. అయితే కోదండరాం మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు! అయితే తాజాగా సడక్ బంద్ విషయంలో ఆయన అరెస్టవ్వడం, జైలులో గడపాల్సి రావడంతో ఆయన ఉద్యోగం ఇంతటితో ఠాం అనే విశ్లేషణలు మొదలయ్యాయి.


ప్రభుత్వ ఉద్యోగులెవరైనా 48 గంటల కు మంచి జ్యూడిషియల్ కస్టడీలో ఉంటే వారు ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతారు. అయితే అదృష్టం కొద్దో, లేక ఏమైనా లాబీయింగ్ ఫలితమో కానీ… ఆ 48 గంటలు గడవకుండానే కోదండరాం విడుదల అయ్యారు. ఉద్యోగాన్ని కాపాడుకున్నారు. ఈసారి కూడా తన ఉద్యోగం గురించి కోదండరాం ఏమీ మాట్లాడలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu