గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత
posted on Aug 10, 2025 12:13PM

గుంటూరు ప్రజల సెంటిమెంట్ బ్రిడ్జిగా చెప్పుకునే, శంకర్ విలాస్ బ్రిడ్జిని అధికారులు కూల్చివేశారు... గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గలను కలిపే ఈ బ్రిడ్జ్, పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరింది ...ఈ బ్రిడ్జ్ దాదాపుగా 70 సంవత్సరాలు పాటు గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకు సేవలు అందించింది... 1950 ప్రాంతంలో నిర్మాణ పనులు ప్రారంభించుకున్న ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి, గడిచిన పాతికేళ్లుగా పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకుంటుంది.
దీంతో స్పందించిన కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ బ్రిడ్జి స్థానంలో టాప్ క్లాస్ బ్రిడ్జి నిర్మాణం చేయించాలని పూనుకున్నారు. అనుకున్నదే తడవుగా 110 కోట్ల రూపాయలతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ,ఈ బ్రిడ్జిని నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 70 ఏళ్లుగా గుంటూరు ప్రజలతో మమేకమైపోయిన శంకర్ విలాస్ బ్రిడ్జి, అనేక ధర్నాలకు, ర్యాలీలకు, వేడుకలకు, వేదికయింది